Scramjet Engine: స్క్రామ్‌జెట్ ఇంజిన్ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్
Sakshi Education
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్) అత్యంత క్లిష్టమైన సూపర్‌సోనిక్ కంబష్టన్ రామ్‌జెట్ (స్క్రామ్‌జెట్) ఇంజిన్ సాంకేతికతను అభివృద్ధి చేసింది.

ఈ ఇంజిన్ సాంకేతికతను 120 సెకన్లపాటు నేలపై విజయవంతంగా పరీక్షించడం దేశంలో ఇదే మొదటిసారి.
స్క్రామ్‌జెట్ ఇంజిన్ సాంకేతికత, తదుపరి తరం హైపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపర్‌సోనిక్ క్షిపణులు 5,400 కిలోమీటర్ల (మాక్ 5) వేగంతో ప్రయాణించగలవు, ఇవి ధ్వనివేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ హైపర్ సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేసింది.
ఈ టెస్ట్ విజయవంతం కావడంతో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ వీ సమీర్ కామత్ అభినందించారు.
Starship Rocket: అంతరిక్షంలో పేలిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్
Published date : 23 Jan 2025 01:07PM