Skip to main content

ICC T20 Rankings 2022 : ఐసీసీ టీ-20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో ఉన్నది వీళ్లే..

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు.
ICC T20 Rankings
ICC T20 Batting Rankings

ఆస్ట్రేలియాతో స్వదేశంలో మొదటి టీ20లో సూర్యకుమార్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే.

T20 World Cup New Rules : టి-20 వ‌ర‌ల్ట్ క‌ప్‌లో అమ‌లు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫ‌స్ట్ టైమ్‌..

మహ్మద్‌ రిజ్వాన్‌ అగ్రస్థానంలో..
ఈ నేపథ్యంలో 780 పాయింట్లతో టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఎయిడెన్‌ మార్కరమ్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ర్యాంకు పతనం కొనసాగుతోంది.

T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..

ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో వైఫల్యం కారణంగా మూడో స్థానానికి పరిమితమైన బాబర్‌..  సెప్టెంబ‌ర్ 21వ తేదీన(బుధవారం) ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఇక ఆసీస్‌తో తొలి టీ20లో విఫలమైన టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి(2 పరుగులు) ఒక ర్యాంకు కోల్పోయి పదహారో స్థానానికి పరిమితమయ్యాడు.

ICC ODI Player Rankings బుమ్రా మళ్లీ నంబర్‌వన్‌

ఐసీసీ టీ-20 బ్యాటింగ్ విభాగంలో.. టాప్‌-5లో ఉన్నది వీళ్లే..
1. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)
2. ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)
3. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)
4. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)
5. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లండ్‌)

Cricket: ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?

Published date : 21 Sep 2022 06:48PM

Photo Stories