Skip to main content

Stop Clock Rule: క్రికెట్‌లో ఇకపై స్టాప్‌ క్లాక్‌ నిబంధన

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది.
Cricket action in Men's T20 with the latest ICC rule in effect, Men's T20 cricket match under the updated ICC regulations, ICC to introduce stop clock rule in cricket, Cricket batsman playing a shot in Men's ODI with new ICC rule,

"స్టాప్‌ క్లాక్‌" పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. 

World Billiards Championship 2023: ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా పంకజ్‌ అద్వానీ

స్టాప్‌ క్లాక్‌ నిబంధన ఏంటంటే..

ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్‌ టైమ్‌గా ఫిక్స్‌ చేసింది. బౌలింగ్‌ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు.

ఈ పరుగులు బ్యాటింగ్‌ టీమ్‌ స్కోర్‌కు యాడ్‌ అవుతాయి. ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్‌ 21)  జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్‌ క్లాక్‌ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 

ATP World Tour: ఏటీపీ టోర్నీ విజేత‌గా నొవాక్‌ జొకోవిచ్‌

Published date : 22 Nov 2023 12:25PM

Photo Stories