Skip to main content

ATP World Tour: ఏటీపీ టోర్నీ విజేత‌గా నొవాక్‌ జొకోవిచ్‌

అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కొత్త చరిత్ర సృష్టించాడు.
World number one Djokovic triumphs in season-ending tournament, Record-breaking moment for Novak Djokovic at ATP Finals, Serbian tennis star makes history in ATP Finals, Novak Djokovic wins the ATP Tournament Title, Novak Djokovic celebrates victory at ATP Finals,

ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా 36 ఏళ్ల జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు.

World Cup 2023: క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ జగజ్జేతగా ఆ్రస్టేలియా

ఇటలీ ప్లేయర్‌ యానిక్‌ సినెర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గతంలో రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు విన్నర్స్‌ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

జొకోవిచ్‌ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో చాంపియన్‌ గా నిలిచాడు.

ICC Cricket World Cup 2023: అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే!

Published date : 21 Nov 2023 02:53PM

Photo Stories