Paris Olympics: టేబుల్ టెన్నిస్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. ఇదే తొలిసారి..
Sakshi Education
పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
ఆగస్టు 5వ తేదీ జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు గేమ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్‌లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్‌ను లెవెల్ (2-2) చేశారు.
చివరి గేమ్‌లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. ఆగస్టు 6వ తేదీ జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్‌ఏ, జర్మనీ మధ్య మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరారు. అయితే, ఆ తరువాతి రౌండ్‌లో వీరు ఓడిపోయారు.
Published date : 06 Aug 2024 09:53AM