World Billiards Championship 2023: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా పంకజ్ అద్వానీ
Sakshi Education
క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు.
అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్‌లో 38 ఏళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1000–416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిపై గెలుపొందాడు.
ATP World Tour: ఏటీపీ టోర్నీ విజేతగా నొవాక్ జొకోవిచ్
సెమీఫైనల్స్‌లో పంకజ్ 900–273తో రూపేశ్ షా (భారత్), సౌరవ్ కొఠారి 900–756తో ధ్రువ్ సిత్వాలా (భారత్)పై విజయం సాధించారు. గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్‌లో 8 సార్లు...లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు... స్నూకర్‌లో 8 సార్లు... టీమ్ ఫార్మాట్‌లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.
Published date : 21 Nov 2023 03:19PM