Skip to main content

Tokyo Paralympics 2020: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారతీయురాలు?

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత మహిళా టీనేజ్‌ షూటర్‌ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది.
AvaniLekhara-TokyoParalympics

2021, ఆగస్టు 30న 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల అవనీ... సెప్టెంబర్‌ 3న 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఎస్‌హెచ్‌–1 ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్‌ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన మహిళల షూటింగ్‌ 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని... 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.

రెండో భారతీయ ప్లేయర్‌...
ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్‌ సింగ్‌ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్‌ త్రోలో కాంస్యం, డిస్కస్‌ త్రోలో కాంస్యం సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారతీయురాలిగా గుర్తింపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 3, 2021
ఎవరు    : షూటర్‌ అవనీ లేఖరా 
ఎందుకు  : టోక్యో పారిలింపిక్స్‌–2020 షూటింగ్‌లో రెండు పతకాలు(10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ –1 విభాగంలో స్వర్ణం, 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఎస్‌హెచ్‌–1 ఈవెంట్‌లో కాంస్యం) నెగ్గినందున... 
 

Published date : 04 Sep 2021 06:33PM

Photo Stories