Skip to main content

Mass Shooting: అమెరికాలో కాల్పులు.. ఆరుగురి దుర్మరణం

అమెరికా మరోసారి తుపాకీ మోతతో దద్దరిల్లింది. నవంబర్‌ 22న వర్జీనియా రాష్ట్రంలోని చెసాపీక్‌ నగరంలోని వాల్‌మార్ట్‌ షాపింగ్‌మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

థ్యాంక్స్‌గివింగ్‌ డేను పురస్కరించుకుని స్థానికుల షాపింగ్‌తో వాల్‌మార్ట్‌ స్టోర్‌ రద్దీగా ఉంది.  అదే స్టోర్‌కు మేనేజర్‌గా భావిస్తున్న ఒక ఆగంతకుడు స్టోర్‌లోని విరామ గదిలో ఉన్న సహోద్యోగులపైకి పిస్టల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత తనను తానే కాల్చుకుని చనిపోయాడు. 

ఇండోనేసియాలో భారీ భూకంపం.. 268 మంది దుర్మరణం

Published date : 24 Nov 2022 12:48PM

Photo Stories