Skip to main content

Indonesia Earthquake:ఇండోనేసియాలో భారీ భూకంపం.. 268 మంది దుర్మరణం

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో నవంబర్‌ 21(సోమవారం) భారీ భూకంపం సంభవించింది. ఎన్నో భవంతులు నేల మట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మొత్తంగా 268 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్‌ రిద్వాన్‌ కమిల్‌ చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.

మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. సియాంజుర్‌ పట్టణంలో ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్‌ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు విగతజీవులయ్యారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులుపెట్టారు. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. జాతీయ విపత్తు దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను స్థానికులు పికప్‌ ట్రక్కులు, బైక్‌లపై ఆస్పత్రులకు తరలించారు. అధిక జనాభా ఉన్న జావా పట్టణంలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి చేరి భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. ఆగకుండా వస్తున్న క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రోగులను రోడ్లపై, ఆరుబయట పార్కింగ్‌ ప్రాంతాల్లోనే చికిత్సచేస్తున్నారు. రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యాలతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రి, పాఠశాల సహా పలు భవంతులు నేలకూలాయి. ఆస్పత్రి కూలి ఎక్కువ మంది చనిపోయారని వార్తలొచ్చాయి.  
రిక్టర్‌ స్కేల్‌పై 5.6 గా నమోదు
రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో వచి్చన భూకంపం పశి్చమ జావాలోని సియాంజుర్‌ రీజియన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. సియాంజుర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ‘మూడుసార్లు భూమి కంపించింది. మొదటిసారి ఆగకుండా పది సెకన్లపాటు కుదిపేసింది’ అని స్థానికులు తెలిపారు. ‘భవంతి ఊగిపోతున్నపుడు 14వ అంతస్థులో ఉన్నాను. మెట్లు దిగి కిందికొచ్చేటపుడు పై ప్రాణాలు పైనే పోయాయి’ అని మహిళా లాయర్‌ మయాదిత చెప్పారు. భూకంపం తర్వాత సైతం 1.8 నుంచి 4 తీవ్రతతో దాదాపు 25 సార్లు ప్రకంపనలు కనిపించాయని ఆ దేశ భూకంపాలు, జియోఫిజిక్స్‌ ఏజెన్సీ తెలిపింది. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులైన 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  27 కోట్ల జనాభా గల ఇండోనేసియాలో భూకంపాలు, అగ్నిప‌ర్వతాలు బద్ధలవడం, సునామీలు సర్వసాధారణం. 2004లో హిందూ మహా సముద్రం అడుగున ఏర్పడి విలయం సృష్టించిన భారీ భూకంపం వెనువెంటనే సునామీ ధాటికి 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరం ఏదంటే..

Published date : 23 Nov 2022 01:06PM

Photo Stories