Isha Singh: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్‌కు రజతం
Sakshi Education
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది.
భోపాల్‌లో డిసెంబర్ 12న ముగిసిన ఈ టోర్నీలో ఇషా సింగ్ జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో 13–17తో హరియాణాకు చెందిన ఒలింపియన్ మను భాకర్ చేతిలో ఓడిపోయింది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కర్ణాటక షూటర్ టీఎస్ దివ్య విజేతగా నిలిచింది.
☛ ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు రజతం
Published date : 13 Dec 2022 01:23PM