Vikram Lander wake up: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు!
నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను మేల్కొల్పడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. సూర్యరశ్మి తాకగానే రోవర్ నుంచి సిగ్నల్ కన్ఫర్మేషన్ కోసం వేచి చూస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. రోవర్, ల్యాండర్ ఇంకా నిద్రాణ స్థితిలోనే ఉన్నాయని చెప్పారు.
Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్
నిద్రాణ స్థితి..
చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజుల వ్యవధిలో నిర్దేశించిన లక్ష‍్యాలను చేరుకున్నాయి. కీలక సమాచారాన్ని చేరవేశాయి. చంద్రునిపై 14 రోజులు పాటు పగలు, 14 రోజులు రాత్రి ఉంటోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న రోవర్‌ను, సెప్టెంబర్ 4న ల్యాండర్ విక్రమ్‌ను నిద్రాణ స్థితిలోకి పంపారు.
Vikram Lander 3D Image: ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రం
మేల్కొల్పు..
విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్.. దక్షిణ ధ్రువానికి 600 మీటర్ల దూరంలో ఉంది. 14 రోజుల తర్వాత చంద్రునిపై నేడు సూర్యోదనయం కానుంది. సూర్యరశ్మి రోవర్‌పై పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.
Vikram lander makes soft-landing:విక్రమ్ ల్యాండర్ మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్