Vikram Lander 3D Image: ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రం
Sakshi Education
చంద్రయాన్ 3 ప్రాజెక్టుని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దింపింది.
చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ అజేయంగా నిలిచింది. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో తాజాగా విడుదల చేసింది. చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగిన ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రమిది. ఆనాగ్రిఫ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఇస్రో ఈ చిత్రాన్ని రూపొందించింది.
Published date : 07 Sep 2023 10:54AM