Mission to Venus: శుక్రయాన్ మిషన్‌ను చేపట్టనున్న దేశం?
చంద్రయాన్, మంగళ్‌యాన్ పేరిట ఇప్పటికే చంద్రునిపైకి, మార్స్‌పైకి మిషన్లను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రోa) ఇక శుక్రయాన్‌పై దృష్టి పెట్టింది. వచ్చే రెండేళ్లలో శుక్ర గ్రహంపైకి శుక్రయాన్ మిషన్‌ను పంపనుంది. ఈ మిషన్ ద్వారా శుక్ర గ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు తదితరాల గుట్టు విప్పాలని భావిస్తోంది. 2024 డిసెంబర్‌కల్లా మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మే 4న ప్రకటించారు. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం..
GK Persons Quiz: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కొత్త సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
- శుక్రుని ఉపరితలంపై చురుగ్గా ఉన్న అగ్ని పర్వతాల హాట్‌స్పాట్స్, లావా ప్రవాహాలు, అక్కడి వాతావరణం తదితరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని శుక్రయాన్ ద్వారా రాబట్టనున్నారు.
- ఇస్రోకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో శుక్రయాన్ మిషన్ తయారీ, ప్రయోగం సాధ్యమే
- శుక్రయాన్‌లో వాడే సబ్ సర్ఫేస్ రాడార్ శుక్రుని ఉపరితలం నుంచి 100 మీటర్ల లోపలికి చొచ్చుకుపోయి పరీక్షలు జరుపుతుంది.
Driverless Taxi: సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2024 డిసెంబర్‌కల్లా శుక్రయాన్ మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఎప్పుడు : మే 04
ఎవరు : ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్
ఎందుకు : శుక్ర గ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు తదితరాల గుట్టు విప్పాలని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్