UKSHA: ఒమిక్రాన్‌పై మూడో డోస్ ఎంత శాతం ప్రభావం చూపిస్తుంది?

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకి ఆస్పత్రి పాలవకుండా టీకా బూస్టర్ డోస్ 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని బ్రిటన్‌కు చెందిన యూకేఎస్‌హెచ్‌ఏ(యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ) అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ టీకా మొదటి రెండు డోసుల కన్నా మూడో డోసు అత్యధిక రక్షణనిస్తుందని తెలిపింది. కోవిడ్ టీకాల రెండో డోసు తీసుకున్న 6 నెలల అనంతరం వాటి రక్షణ 52 శాతానికి పడిపోతోందని ఆరోగ్య నిపుణుడు ప్రొఫెసర్ ఎరిక్ టోపాల్ చెప్పారు. బూస్టర్‌డోస్‌తో టీకా రక్షణ సామర్థ్ధ్యం (రెండోడోసు ముగిసిన ఆరు నెలల తర్వాత) 52 నుంచి 88 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు.
టీనేజర్లకు వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
దేశవ్యాప్తంగా 1518 ఏళ్ల గ్రూపు వారికి జనవరి 3న ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్‌లో తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు టీకా వేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
చదవండి: కరోనానంతర సమస్యలకు లీ హెల్త్ రూపొందించిన ఔషధం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్