New Drug: కరోనానంతర సమస్యలకు లీ హెల్త్ రూపొందించిన ఔషధం?
ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ హెల్త్ డొమైన్.. సహజ పదార్థాలతో న్యూట్రాస్యూటికల్ ట్యాబ్లెట్స్‌ను ‘‘యాక్టోకిన్’’ పేరుతో విడుదల చేసింది. కరోనా వంటి వైరస్ సంబంధ అంటువ్యాధుల బారినపడ్డ వారిలో కీళ్ల నొప్పులు, చేతులు, కాళ్లు, పాదాలలో మంట తదితర నరాల సమస్యలను తగ్గించడానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి సహాయక చికిత్సగా శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ చర్యతో వీటిని రూపొందించింది.
కాన్పూర్ మెట్రో ప్రారంభం
ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి మోదీ ఝీల్ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు.
చదవండి: అగ్ని ప్రైమ్ పరీక్షను ఎక్కడ నుంచి నిర్వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యాక్టోకిన్ పేరుతో ఔషధం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ హెల్త్ డొమైన్
ఎందుకు : కరోనానంతర సమస్యల నివారణకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్