DRDO: అగ్ని ప్రైమ్ పరీక్షను ఎక్కడ నుంచి నిర్వహించారు?
అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న బాలిస్టిక్ మిసైల్ ‘‘అగ్ని ప్రైమ్(అగ్ని–పి)’’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 18న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపం(భద్రక్ జిల్లా)లో ఈ పరీక్ష చేసినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని వెల్లడించింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని పేర్కొంది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. తొలిసారి ఈ క్షిపణిని 2021, జూన్ 28న పరీక్షించారు. వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్‌డీఓ తెలిపింది.
చదవండి: స్మార్ట్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగ్ని ప్రైమ్(అగ్ని–పి) మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత్
ఎక్కడ : అబ్దుల్ కలామ్ ద్వీపం, భద్రక్ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్