Missile Test: స్మార్ట్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గామిని సైతం అత్యంత కచ్చితత్వంతో పేల్చివేసే అధునాతన ఆయుధ వ్యవస్థ ''సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో(SMART-స్మార్ట్)''ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 13న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపం(భద్రక్ జిల్లా)లో ఈ పరీక్ష చేసినట్లు భారత రక్షణ పరిశోధన, అభిసంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. ప్రయోగంలో మిసైల్ ఫుల్‌రేంజ్ సామర్ధ్యం నిరూపితమైందని వివరించింది. సాంప్రదాయ టార్పెడో రేంజ్ కన్నా అధిక శక్తివంతమైన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ రూపకల్పనలో భాగంగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. మిసైల్ ప్రయాణ మార్గాన్ని ఎలక్ట్రో అప్టిక్ టెలిమెట్రీ వ్యవస్థతో పర్యవేక్షించామని, మిసైల్‌లో ఒక టార్పెడో, ఒక పారచూట్ విడుదల వ్యవస్థ ఉన్నాయని వివరించింది. భూమిపై కదిలే వాహనాల నుంచి కూడా దీన్ని లాంచ్ చేయవచ్చు. దేశీయ నావికా శక్తిని ఈ స్మార్ట్ మరింత బలోపేతం చేస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
చదవండి: భూ పరీక్షక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో(SMART-స్మార్ట్) సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత్
ఎక్కడ : అబ్దుల్ కలామ్ ద్వీపం, భద్రక్ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్