Soil Testing: భూ పరీక్షక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ?
భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు ప్రత్యేకమైన పోర్టబుల్, వైర్‌లెస్ సాయిల్ టెస్టింగ్ పరికరాన్ని(పోర్టబుల్ టెస్టింగ్ డివైజ్) ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ–కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఈ పరికరం ద్వారా కేవలం 90 సెకన్లలో భూసార ఫలితం తెలుసుకోవచ్చు. పరీక్ష కోసం ఐదు గ్రాముల మట్టి చాలు. ‘భూ పరీక్షక్’ యాప్ ద్వారా ఈ పరికరాన్ని ఉపయోగించి మట్టిలోని పోషకాలను కచ్చితంగా తెలుసుకోవచ్చని ఐఐటీ–కాన్పూర్ తెలిపింది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని పేర్కొంది.
ఐఐటీ–కాన్పూర్‌లోని డిపార్ట్‌మెంట్ కెమికల్ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ జయంత్‌కుమార్ సింగ్, పల్లవ్ ప్రిన్స్, అషర్ అహ్మద్, యశస్వి ఖేమాని, మొహమ్మద్ అమిర్‌ఖాన్‌తో కూడిన బృందం ఈ ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ డివైజ్‌ను అభివృద్ధి చేసింది.
చదవండి: సాంట్ మిస్సైల్ పరీక్ష ఎక్కడ నిర్వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూ పరీక్షక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ?
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఐఐటీ–కాన్పూర్
ఎందుకు : పోర్టబుల్, వైర్‌లెస్ సాయిల్ టెస్టింగ్ పరికరాన్ని ఉపయోగించి భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు..