Skip to main content

Spacewalk: రికార్డు.. అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌వాక్

స్పేస్‌ఎక్స్ అంతరిక్ష సంస్థ అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది.
Jared Isaacman during the first private spacewalk in space First Private Spacewalk in SpaceX Capsule Achieves New Milestone  Non-professional astronaut Jared Isaacman on spacewalk in orbit SpaceX spacecraft with Jared Isaacman performing a spacewalk

ప్రైవేట్‌ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్‌ చేసిన మొట్టమొదటి నాన్‌–ప్రొఫెషనల్‌ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్‌ ఐజాక్‌మాన్‌(41) రికార్డు సృష్టించారు. సెప్టెంబ‌ర్ 12వ తేదీ భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్‌’ స్పేస్‌ క్యాప్సూల్‌ నుంచి బయటకు వచ్చి, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. 

అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్‌మాన్‌ తర్వాత స్పేస్‌ఎక్స్‌ ఇంజనీర్‌ సారా గిల్లిస్‌ స్పేస్‌వాక్‌ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్‌ క్యాప్సూల్‌ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్‌ఎక్స్‌ తలపెట్టిన ‘పోలారిస్‌ డాన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా సెప్టెంబ‌ర్ 10వ తేదీ ఐజాక్‌మాన్‌ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. 

NASA Contract: పిక్సెల్‌కు నాసా కాంట్రాక్టు.. భారతీయ స్పేస్‌టెక్‌కు గొప్ప అవకాశం

సెప్టెంబ‌ర్ 12వ తేదీ తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్‌ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్‌ మస్క్‌తోపాటు ఐజాక్‌మాన్‌ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పొలారిస్‌ డాన్‌ మిషన్‌ అంటే ఏమిటి?
పొలారిస్‌ డాన్‌ మిషన్‌ కింద క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు తక్కువ భూ కక్ష్యలోకి వెళ్తారు. మిషన్‌ సమయంలో.. వ్యోమగాములు కక్ష్యలో ఐదు రోజులు గడుపుతారు. మిషన్‌ లాంచ్‌ మూడో రోజున ఇద్దరు వ్యోమగాములు క్యాప్సూల్‌ నుంచి బయటకు వచ్చి 15 నుంచి 20 నిమిషాలపాటు స్పేస్‌వాక్‌ చేస్తారు. 

INS Arighaat: భారత్‌ అమ్ముల పొదిలో అణు జలాంతర్గామి.. దీని ప్రత్యేకతలు ఇవే..

Published date : 13 Sep 2024 12:32PM

Photo Stories