NASA Contract: పిక్సెల్‌కు నాసా కాంట్రాక్టు.. భారతీయ స్పేస్‌టెక్‌కు గొప్ప అవకాశం
476 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం ఎనిమిది కంపెనీలు ఎంపికవగా, వాటిలో పిక్సెల్ కూడా ఒకటి. ఈ కాంట్రాక్టు ద్వారా పిక్సెల్ తన హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి భూమిపై జీవనాన్ని మెరుగుపర్చేందుకు నాసా సాగిస్తున్న పరిశోధన కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఎర్త్ అబ్జర్వేషన్ డేటాను అందిస్తుంది. ఈ డేటా వాతావరణ మార్పులు, వ్యవసాయం, జీవ వైవిధ్యం వంటి అనేక రంగాలలో విశ్లేషణకు ఉపయోగపడుతుంది.
హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్: పిక్సెల్ తన హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా కాంతి తరంగధైర్ఘ్యాల వ్యాప్తంగా ఉండే డేటాను సేకరిస్తుంది. ఈ డేటాను ఉపయోగించి భూమిపై జరిగే చాలా మార్పులను చాలా సూక్ష్మంగా గుర్తించవచ్చు.
ఫైర్‌ఫ్లైస్ ఉపగ్రహాలు: పిక్సెల్ మరింత అధిక రిజల్యూషన్‌తో ఇమేజ్‌లు ఇచ్చే ఫైర్‌ఫ్లైస్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
నాసాకు ప్రయోజనాలు: ఈ కాంట్రాక్టు ద్వారా నాసా తక్కువ వ్యయంతో భూగోళ అధ్యయనానికి అవసరమయ్యే వివరాలను సేకరించగలుగుతుంది.
NASA: మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం.. భూమిపైకి చేరుకునే అవకాశం