Skip to main content

AI Project: గూగుల్‌ సరికొత్త ప్రయోగం.. మరి దాని ప్రత్యేకత..!

క్టిష్టమైన ప్రశ్నలకు సులువుగా సమాధానం తెలుసుకునేందుకు గూగుల్‌ ఈ సరికొత్త ఫన్‌సర్చ్‌ను కనుగొంది. సమాధానాలు లభించే రంగాలను కూడా వారు తెలియజేసారు. ఈ సందర్భంగా పరిశీలన జరిపిస్తే, దీని వివరాలు ఈ కథనంగా తెలిసాయి.
AI Model fun search by google

కృత్రిమమేధ ఆవిష్కరణలతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సాంకేతికత ఆధారంగా గణిత, వైద్య, న్యాయ, మానసిక శాస్త్రాలు, కోడింగ్‌కు సంబంధించి అడిగే కఠిన ప్రశ్నలకు వెంటనే సమాచారం లభిస్తోంది. సమీప భవిష్యత్తులో సమాజానికి ఇది ఎంతో మేలు చేస్తుందని కొందరు భావిస్తున్నారు.

ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని కృత్రిమమేధ (ఏఐ) కొత్తపుంతలు తొక్కిస్తోంది. తాజాగా సంక్లిష్ట గ‌ణిత స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడ‌ల్ ఫ‌న్‌సెర్చ్‌ను గూగుల్ డీప్‌మైండ్ ప‌రిశోధ‌కులు క్రియేట్ చేశారు. క్లిష్ట‌మైన గ‌ణిత స‌మ‌స్య‌ల‌ను గూగుల్ ఫ‌న్‌సెర్చ్ ఏఐ మోడ‌ల్ సుల‌భంగా ప‌రిష్క‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జవాబు దొరకని కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేలా కృషి చేసినట్లు తెలిసింది. లార్జ్‌ ల్యాంగ్వేజ్‌ మోడళ్లు (ఎల్‌ఎల్‌ఎం)ను ఉపయోగించి ఈ ఆవిష్క‌ర‌ణలు చేసినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది.

ఎల్ఎల్ఎంలు ఇన్నిరోజులు కేవ‌లం ఊహాత్మ‌క కంటెంట్‌ను జ‌న‌రేట్ చేస్తాయ‌నే భావన ఉండేదని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ వాటిని స‌రైన రీతిలో వినియోగించుకుని మార్గ‌నిర్దేశం చేస్తే  అవి ఆవిష్క‌ర‌ణ‌ల‌కూ తెర‌తీస్తాయ‌ని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్‌మైండ్ ప్రాథమిక గణితం, కంప్యూటర్ సైన్స్‌లోని చాలా సవాళ్లను ఫన్‌సర్చ్‌ ద్వారా సాధించిందని సమాచారం. గూగుల్ డీప్‌మైండ్ వైస్ ప్రెసిడెంట్‌ పుష్మీత్ కోహ్లీ సార‌థ్యంలోని ప్రత్యేక ప‌రిశోధ‌క బృందం ట్ర‌య‌ల్ అండ్ ఎర్ర‌ర్ మెథడాల‌జీ ద్వారా గ‌ణితంలో సంక్లిష్ట స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తోందని తెలిసింది. 

Published date : 18 Dec 2023 01:13PM

Photo Stories