Singareni Thermal Power Plant: అగ్రస్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
Sakshi Education
మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 90.86% సామర్థ్యంతో విద్యుదుత్పత్తి(పీఎల్‌ఎఫ్) సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ఆరేళ్ల క్రితం ప్రారంభమైన విద్యుత్ కేంద్రం ఏటా అత్యధిక పీఎల్‌ఎఫ్ సాధిస్తూ దేశంలోని 25 అత్యుత్తమ థర్మల్ ప్లాంట్లలో ఒకటిగా నిలిచిందని సింగరేణి సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండోదశ కింద కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 2026 నాటికి పూర్తి చేస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
☛ PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం
Published date : 02 Dec 2022 12:35PM