Skip to main content

Semi-cryogenic Engine Test: సెమీ క్రయోజనిక్‌ పరీక్ష విజయవంతం

సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఇంటర్‌మీడియ‌ట్‌ కాన్ఫిగరేషన్‌ పరీక్ష (పవర్‌ హెడ్‌ టెస్ట్ ఆర్టిక‌ల్‌)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రపొల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ) సెంటర్‌లో జులై  1న మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.
Semi-cryogenic Engine
Semi-cryogenic Engine

‘‘భవిష్యత్తు ప్రయోగ వాహనాలను దృష్టిలో ఉంచుకుని బూస్టర్‌ దశలను శక్తిమంతం చేయడం, 2000 కేఎన్‌ థ్రస్ట్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజన్‌ను అభివృద్ధి చేయడం ఈ పరీక్ష లక్ష్యం. గ్యాస్‌ జనరేటర్, టర్బో పంపులు, ప్రీ–బర్నర్, కంట్రోల్‌ కాంపోనెంట్‌ల వంటి కీలకమైన సబ్‌ సిస్టమ్‌ల సమగ్ర పనితీరును 4.5 సెకండ్ల స్వల్ప వ్యవధిలో హాట్‌ ఫైరింగ్‌ చేసి ధ్రువీకరించడం దీని ముఖ్య ఉద్దేశం’’ అని ఇస్రో తన వైబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఇంధనం, ఆక్సిడైజర్‌ పంపులను నడపడానికి ప్రధాన టర్బైన్‌ను నడిపించే ప్రీ బర్నర్‌ ఛాంబర్‌లోని వేడి–గ్యాస్‌ జ్వలన, ఉత్పత్తిని పరీక్షించారు. ఇప్పటిదాకా లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ హైడ్రోజన్‌తో కలిపి క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేశారు. ఈ సెమీ క్రయోజనిక్‌ ఇంజన్‌ను మాత్రం సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఇందులో లిక్విడ్‌ ఆక్సిజన్‌కు తోడుగా కిరోసిన్‌ ప్రపొల్లెంట్‌ కలయికతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. 

 Daily Current Affairs in Telugu: 4 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 04 Jul 2023 05:17PM

Photo Stories