Skip to main content

Moon King: ‘మూన్‌ కింగ్‌’గా మళ్లీ శని గ్రహం

సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్‌ కింగ్‌’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది.
Moon King

ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్‌కింగ్‌గా కొనసాగుతోంది.
అయితే, అకాడెమియా సినికా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఎడ్వర్డ్‌ ఏస్టన్‌ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్‌కింగ్‌’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)

 

Published date : 18 May 2023 08:24AM

Photo Stories