Insight Mars lander: ఇన్‌సైట్ లాండర్ తుది సందేశం
Sakshi Education
నాలుగేళ్లుగా అంగారకుని ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న నాసా ఇన్‌సైట్ లాండర్ తాజాగా పంపిన స్వీయ చిత్రమిది.
అంగారకుని తాలూకు దుమ్మూ ధూళీ దానిపై పూర్తిగా పరుచుకుని ఉండటాన్ని గమనించవచ్చు. దాని సౌర పలకలను దుమ్ము పూర్తిగా కప్పేసింది. దాంతో త్వరలో లాండర్‌కు నాసాతో సంబంధాలు శాశ్వతంగా తెగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘నా శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. బహుశా నేను పంపే చివరి ఫొటో ఇదే కావచ్చు’’ అంటూ సందేశం పంపింది! ‘‘రెండు గ్రహాల మీద గడిపే అదృష్టం నాకు దక్కింది. త్వరలో శాశ్వతంగా సెలవు తీసుకుంటా. ఇంతకాలం నాతోపాటు ఉన్నందుకు థాంక్స్. నా గురించి బాధ పడొద్దు’’ అని చెప్పుకొచ్చింది. అంగారకుని లోపలి పొరలపై పరిశోధన తదితరాల కోసం నాసా దాన్ని నాలుగేళ్ల క్రితం ప్రయోగించింది. రెండేళ్లు పని చేస్తే చాలని భావించగా అది ఏకంగా నాలుగేళ్ల పాటు అరుదైన ఫొటోలు, సమాచారం పంపుతూ వచ్చింది.
Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..
Published date : 21 Dec 2022 01:44PM