Skip to main content

Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..

అంతరిక్షంలో రగడ జరుగుతోంది! మరణిస్తున్న ఓ తారను అతి భారీ కృష్ణ బిలమొకటి శరవేగంగా కబళించేస్తోంది.

ఈ ఘర్షణ వల్ల చెలరేగుతున్న కాంతి పుంజాలు సుదూరాల దాకా కనువిందు చేస్తున్నాయి. ఈ అరుదైన అంతరిక్ష దృగ్విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని సరస్వతి పర్వత శిఖరంపై ఉన్న టెలిస్కోప్‌ ‘గ్రోత్‌’ గుర్తించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్, ఐఐటీ బాంబే సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇది భారత తొలి పూర్తిస్థాయి రొబోటిక్‌ ఆప్టికల్‌ రీసెర్చ్‌ టెలిస్కోప్‌.
‘‘అంత్య దశలో ఉన్న ఆ నక్షత్రాన్ని భారీ కృష్ణబిలం అనంతమైన ఆకర్షణ శక్తితో తనలోకి లాగేసుకుంటోంది. దాంతో నక్షత్రం ఊహాతీత వేగంతో దానికేసి సాగుతోంది. వీటిని టైడల్‌ డిస్‌రప్షన్‌ ఈవెంట్స్‌ (టీడీఈ) అంటారు’’ అని ఐఐటీ బాంబే ఆస్ట్రో ఫిజిసిస్ట్‌ వరుణ్‌ భలేరావ్‌ వివరించారు. ఈ అంతరిక్ష రగడకు కేంద్రం మనకు 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట! ఈ అధ్యయన ఫలితాలు జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.

National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం

Published date : 03 Dec 2022 01:05PM

Photo Stories