Skip to main content

NASA Restores contact with Voyager 2: ప్రాణం పోసుకున్న‌ నాసా వోయేజర్‌–2 వ్యోమనౌక

ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్‌–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది.
NASA-Restores-contact-with-Voyager 2
NASA Restores contact with Voyager 2

ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపు 12 బిలియన్ల మైళ్ల (దాదాపు 2,000 కోట్ల కిలోమీటర్లు) దూరంలో ఉంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల గత నెల 21 తేదీన వోయేజర్‌–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి.
కంట్రోలర్లు పొరపాటున తప్పుడు కమాండ్‌ పంపించడమే కారణమని సమాచారం. ఫలితంగా వోయేజర్‌–2 యాంటెనా స్వల్పంగా పక్కకు జరిగింది. దాంతో సంకేతాలు నిలిచిపోయాయి. నాసా సైంటిస్టులు వెంటనే రంగంలో దిగారు. సంకేతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ రేడియో యాంటెనాలతో కూడిన డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ ద్వారా కమాండ్‌ పంపించారు.

Aditya-L1 Mission: సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్‌1

దీనికి వోయేజర్‌–2  స్పందించి 18 గంటల తర్వాత భూమిపైకి సంకేతాలను పంపించింది. నాసా శాస్త్రవేత్తలు వోయేజర్‌–2 యాంటెనాను సరిచేసే పనిలో విజయం సాధించారు. ఇందుకోసం కమాండ్‌ను పంపించారు. స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్‌ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. వోయేజర్‌–2 ఎప్పటిలాగే పనిచేస్తోందని, యధావిధిగా సేవలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేసింది.

ఏమిటీ వోయేజర్‌–2?  

అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్‌ 5న వోయేజర్‌–1, 1977 ఆగస్టు 20న వోయేజర్‌–2 వ్యోమనౌకలను పంపించింది. కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌లో వీటిని రూపొందించారు. భూమికి సంబంధించిన శబ్ధాలు, చిత్రాలు, సందేశాలను ఇందులో చేర్చారు. గత 36 ఏళ్లుగా నిరి్వరామంగా పనిచేస్తున్నాయి. ఇతర గ్రహాల సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి.

ISRO PSLV-C56 Mission: ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ–56 అంత‌రిక్ష ప్ర‌యోగం విజయం

2012 ఆగస్టులో వోయేజర్‌–1 ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లోకి ప్రవేశించింది. అంటే అంతరిక్షంలో లక్షల కోట్ల ఏళ్ల క్రితం కొన్ని నక్షత్రాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. ఆ తర్వాత వోయేజర్‌–2 కూడా ఈ స్పేస్‌లోకి ప్రవేశించింది. వోయేజర్‌–2 1986లో యురేనస్‌ గ్రహం సమీపానికి వచి్చంది. దాని ఉపగ్రహాలను గుర్తించింది. గురు, శనిగ్రహాలకి సంబంధించిన యూరోపా, ఎన్సిలాడస్‌ అనే ఉపగ్రహాలపై మంచు కింద సముద్రాల ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. 

Chandrayaan-3 Success: చంద్రయాన్‌–3 ప్ర‌యోగం స‌క్సెన్‌

Published date : 07 Aug 2023 06:31PM

Photo Stories