Skip to main content

ISRO PSLV-C56 Mission: ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ–56 అంత‌రిక్ష ప్ర‌యోగం విజయం

పీఎస్‌ఎల్‌వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
ISRO-PSLV-C56-Mission
ISRO PSLV-C56 Mission

దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం.
పీఎస్‌ఎల్‌వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్‌ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

☛☛ PSLV-C56 Mission: 30న పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం

352 కిలోలు బరువు కలిగిన డీఎస్‌–ఎస్‌ఏఆర్‌ (షార్ట్‌ ఫర్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌) అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్‌–ఏఎం, 12.8 కిలోల ఓఆర్‌బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్‌–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్‌ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్‌ నుంచి చేసిన 90వ ప్రయోగమిది.

☛☛  Isro completes two more tests for Gaganyaan: గగన్‌యాన్‌ పరీక్షలు విజయవంతం

అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం:

పీఎస్‌ఎల్‌వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్‌–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్‌–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది.

☛☛ Chandrayaan-3 Success: చంద్రయాన్‌–3 ప్ర‌యోగం స‌క్సెన్‌

Published date : 31 Jul 2023 12:58PM

Photo Stories