Isro completes two more tests for Gaganyaan: గగన్‌యాన్ పరీక్షలు విజయవంతం
సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(ఎస్‌ఎంపీఎస్)ను బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, వలియామల, తిరువనంతపురంలలో డిజైన్ చేసి, అభివృద్ధి పరిచారు.
ఈ తరహాలో మొదటి హాట్ టెస్ట్‌ను ఈనెల 19న నిర్వహించారు. పేజ్–2 టెస్ట్ సిరీస్‌లో రెండు, మూడు హాట్ టెస్ట్‌లను బుధవారం చేపట్టి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. 723.6 సెకెండ్ల పాటు సాగిన ప్రారంభ హాట్‌టెస్ట్ ఆర్బిటల్ మాడ్యూల్ ఇంజెక్షన్, 100 ఎన్ థ్రస్ట్‌లు లిక్విడ్ అపోజిమోటార్ (ఎల్‌ఏఎం) ఇంజిన్‌ల కాలిబ్రేషన్ బర్న్‌ను ప్రదర్శించారు. నాన్ అపరేషన్ ఇంజిన్‌ను గుర్తించి, వేరు చేయడానికి కాలిబరేషన్ బర్న్ అవసరమైంది. లామ్ ఇంజిన్‌ల రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లు ఊహించిన విధంగా పనిచేయడంతో ఈ పరీక్షలు విజయవంతమై’నట్లు ఇస్రో ప్రకటించింది.
☛☛PSLV-C56 Mission: 30న పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం