Skip to main content

Aditya-L1 Mission: సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్‌1

సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్‌ మొదటివారంలో గానీ పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.
Aditya-L1-Mission
Aditya-L1 Mission

షార్‌ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.

☛☛ ISRO PSLV-C56 Mission: ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ–56 అంత‌రిక్ష ప్ర‌యోగం విజయం 

సౌరగోళంపై అధ్యయనం కోసం ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్‌ మొదటివారంలో గానీ ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు స్పేస్‌ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.

☛☛ Chandrayaan-3 heads towards Moon: చంద్రుని వైపు చంద్రయాన్‌-3 ప్రయాణం

Published date : 04 Aug 2023 03:25PM

Photo Stories