Chandrayaan-3 heads towards Moon: చంద్రుని వైపు చంద్రయాన్-3 ప్రయాణం
ప్రొపల్షన్ మాడ్యూల్‌లో నింపిన అపోజి ఇంధనాన్ని మండించి చంద్రయాన్–3 మిషన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యవైపు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ఇలా చంద్రయాన్–3 కక్ష్య దూరం మరోమారు పెంచారు.
అక్కడ నుంచి ఐదు రోజులపాటు చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకురావడానికి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది.
☛☛ chandrayyan-3 ready to launch: చంద్రయాన్–3 ప్రయోగానికి సిద్దం.. దీని ప్రత్యేకతలు ఇవే...
ఆ కక్ష్యలోకి వచ్చాక ఆగస్టు 23వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తర్వాత అది ల్యాండర్‌ను జార విడుస్తుంది. ఆ రోజు సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్ విచ్చుకుని లోపలి నుంచి రోవర్ బయటకు అడుగుపెట్టనుంది. అది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేసి సమాచారాన్ని అందిస్తుంది. అంటే చంద్రయాన్–3 మిషన్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకోవడానికి ఇంకా 17 రోజులు, చంద్రుడిపై దిగడానికి 23 రోజులు పడుతుందన్న మాట.
☛☛ Chandrayaan-3 Success: చంద్రయాన్–3 ప్రయోగం సక్సెన్
The Moon, as viewed by #Chandrayaan3 spacecraft during Lunar Orbit Insertion (LOI) on August 5, 2023.#ISRO pic.twitter.com/xQtVyLTu0c
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 6, 2023