Skip to main content

Japan First Rocket Kairos: జపాన్‌ తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలం

జపాన్‌ చరిత్రలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది.
Kushimoto Town Rocket Launch Incident   Japan's First Privately Developed Rocket Explodes Seconds After Lift Off

మార్చి 13వ తేదీ ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి బయల్దేరిన కైరోస్‌ రాకెట్‌ లాంచ్‌ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. రాకెట్‌ పేలిపోవడానికి కారణాలు ఇంకా తెలియవు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో ఘన ఇంధనంలో లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. 

ఈ రాకెట్‌ను స్పేస్‌ వన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది.

ఈ ప్రమాదంతో జపాన్‌ వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న ఆశలకు గండి పడింది. ఈ రాకెట్‌ మార్చ్‌ 9వ తేదీనే లాంచ్‌ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్‌ వాయిదాపడింది. రాకెట్‌ పేలిపోవడంతో స్పేస్‌ వన్‌ కంపెనీ షేర్లు జపాన్‌ స్టాక్‌మార్కెట్‌లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి.

Agni-5 Missile: అగ్ని–5 క్షిపణి.. శత్రువుకు వణుకే..!

Published date : 13 Mar 2024 02:55PM

Photo Stories