ISRO PSLV-C54 Mission : పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం సక్సెస్.. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు..
ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు..
ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్‌ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం.
Iran: ఉపగ్రహ ప్రయోగానికి అనువైన రాకెట్‌ను పరీక్షించిన ఇరాన్
ఎన్నో ఏళ్ల కృషికి..
పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతవరణంపై పీఎస్‌ఎల్వీ సీ54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
Vikram-S: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ కంపెనీ