Iran: ఉపగ్రహ ప్రయోగానికి అనువైన రాకెట్‌ను పరీక్షించిన ఇరాన్
Sakshi Education
ఒకవైపు ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతుండగా.. ఆ దేశంలో శక్తిమంతమైన పారామిలిటరీ దళం‘రివల్యూషనరీ గార్డ్’ఉపగ్రహ ప్రయోగానికి అనువైన రాకెట్‌ను పరీక్షించింది.
భూమి ఉపరితలానికి 500 కిలోమీటర్ల ఎత్తులో 80 కిలోల ‘నహీద్’ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగల ఈ ఘన ఇంధన రాకెట్ పేరు ‘ఘయీమ్100’ అని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. శాస్త్రీయ పరిశోధనలు, పౌర అవసరాల కోసమే అణు కార్యక్రమాలను, ఉపగ్రహ ప్రయోగాలను నిర్వహిస్తున్నట్లు ఇరాన్ చెబుతోంది. అణు బాంబులు, దూరశ్రేణి క్షిపణుల తయారీకీ ఇవే కార్యక్రమాలు ఉపయోగపడతాయని అమెరికా అనుమానిస్తోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Nov 2022 07:10PM