Skip to main content

ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్‌–1 ప్రయోగం

ISRO: ఏ రాకెట్‌ ద్వారా గగన్‌యాన్‌–1 ప్రయోగాన్ని చేపట్టనున్నారు? Telugu Current Affairs and General Essay - Science and Technology: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా 2022 ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్‌–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ISRO - Gaganyaan

ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది.

Indian Navy: ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్‌?

సుమారు 3.5 టన్నుల బరువు..

  • గగన్‌యాన్‌–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని స్ప్రాబ్‌ విభాగంలో 2022, మే 13న ఎస్‌–200 (ఘన ఇంధన మోటార్‌) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. 
  • భారీ రాకెట్‌ ప్రయోగానికి ఉపయోగించే ఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్‌–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్‌ (వ్యోమనాట్స్‌ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది.
  • క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్‌ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు. 

GK Science & Technology Quiz: "నూర్-2" అనే సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?

ప్రాణ నష్టాన్ని నివారించేందుకు..

  • మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు.
  • ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్‌ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.  

Lunar Soil: ఏ దేశ శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు?

ఇస్రో ప్రొపల్షన్‌ సెంటర్‌లో..

  • గగన్‌యాన్‌–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్‌ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్‌ సెంటర్‌లో 2022, జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు.
  • క్రయోజనిక్‌ మోటార్‌లో 12 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్‌ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.

DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?

GK Important Dates Quiz: సేవ్ ది ఎలిఫెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

ఆర్‌ఎల్‌వీ–టీడీ ప్రయోగం విజయవంతం

  • సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌–టెక్నికల్‌ డిమాన్‌స్ట్రేటర్‌(ఆర్‌ఎల్‌వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. 
  • ఈ తరహా రాకెట్‌ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్‌ సోనిక్‌ ఫ్లైట్‌ను విడుదల చేసింది.
  • ఆ ఫ్లైట్‌ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్‌ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు.
  • దానికి ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్స్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్‌ మెజర్‌మెంట్, షిప్‌ బర్న్‌ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు.
  • వ్యోమనాట్స్‌ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌–టెక్నికల్‌ డిమాన్‌స్ట్రేటర్‌ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు.

Mission to Venus: శుక్రయాన్‌ మిషన్‌ను చేపట్టనున్న దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 May 2022 05:32PM

Photo Stories