GSAT-20 Satellite: తొలిసారి SpaceX సేవలు వినియోగించుకోనున్న ఇస్రో..!
Sakshi Education
సమయానికి వేరే రాకెట్ అందుబాటులోలేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది.
4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్‌ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్‌ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి.
సంబంధిత వివరానలను ఇస్రో వాణిజ్యవిభాగమైన న్యూస్పేస్ ఇండియ లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) జనవరి 3వ తేదీ వెల్లడించింది. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ–ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్‌లనే మోసుకెళ్లగలదు. అంతకుమించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులోలేని కారణంగా స్పేస్‌ఎక్స్‌ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.
ISRO’s XPoSat Launch: కొత్త సంవత్సరం తొలిరోజే నింగిలోకి ఎగసిన ఎక్స్‌పోశాట్..
Published date : 05 Jan 2024 10:45AM