Skip to main content

5G services in India : 5జీ సేవలు ప్రారంభించిన‌ ప్రధాని.. భార‌త్‌లో మొట్ట‌మొద‌టి సారిగా ఈ గ్రామం నుంచే..

దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు (5G Services) ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా (అక్టోబర్‌ 1న) లాంఛనంగా ప్రారంభమైంది.

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్‌ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు.

5G Technology: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్‌ అభివృద్ధి చేసిన సంస్థ?

ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్‌ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. ప్రధానికి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోదీ స్వయంగా పరిశీలించారు. రిలయన్స్‌ జియో అహ్మదాబాద్‌ సమీపంలోని ఓ గ్రామంలో, భారతీ ఎయిర్‌టెల్‌ వారణాసిలో 5జీ సేవలను ప్రారంభిస్తాయి.

5g

ప్రధాని ఈ సందర్భంగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తోపాటు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో 5జీ టెక్నాలజీ ఆధారంగా కనెక్ట్‌ కాబోతున్నారు. వొడాఫోన్‌ ఐడియా సైతం 5జీ సేవలను ప్రారంభించనుంది. కాగా, దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో 5జీ సేవలను పరిచయం చేస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది.

Industry 4.0: 5జీ టెక్నాలజీ.. రెండు కోట్ల కొలువులు రెడీ!

5g

నెల రోజుల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ కూడా వెల్లడించారు.  ముందుగా 5జీ సేవలను 13 నగరాలకు అందించనున్నారు. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌నగర్.

5G services: 4జీ చార్జీలకే 5జీ సేవలు!

Published date : 01 Oct 2022 01:43PM

Photo Stories