Skip to main content

Aadhaar Data Leak: డార్క్ వెబ్‌లో 81.5 కోట్ల భారతీయులు వివరాలు లీక్

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు.
81.5 crore Indians' personal data leaked in dark web
81.5 crore Indians' personal data leaked in dark web

ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది.

Jio Space Fiber: జియో ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్

లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది.

ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది.
డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్‌లో కొవిన్ వెబ్‌సైట్‌ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు.

Reference Fuel: దేశీయ రిఫరెన్స్‌ ఇంధనం తయారీ ప్రారంభం

ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు!

భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్‌ దోపిడీలు, ట్యాక్స్‌ రిఫండ్‌ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.

Skin Cancer Soap: స్కిన్‌ క్యాన్సర్‌కి సబ్బుతో చెక్‌..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ

Published date : 31 Oct 2023 05:20PM

Photo Stories