Jio Space Fiber: జియో ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్
Sakshi Education
భారతదేశపు ప్రముఖ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 'జియోస్పేస్ ఫైబర్' బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టింది.
భారతదేశ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ టెక్నాలజీని జియో ప్రవేశపెట్టింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రిలయన్స్ జియో ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ బ్రాడ్‌బ్యాండ్ రాజధానిగా స్థాపించే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఇప్పటికే మొదటి మూడు 5G ప్రారంభించిన మొదటి మూడు దేశాలలో ఒకటిగా ఉంది, భారత్ ఇప్పటి వరకు 125 మిలియన్లకు పైగా 5G వినియోగదారులను కలిగి ఉంది.
Published date : 30 Oct 2023 06:56PM