Skip to main content

Sunita Williams: రోదసీ యాత్ర‌కు సిద్ధ‌మైన‌ సునీతా విలియమ్స్..

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు.
 Rodasi Yatra mission   Astronaut training for space mission  Astronaut Sunita Williams New Space Mission Postponed To May 17th

ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.

మే 7వ తేదీ తలపెట్టిన ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్‌ ద్వారా తెలిపింది. కాగా, మరమ్మతుల కోసం అట్లాస్-5 రాకెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. తల భాగంలో బోయింగ్ ‘స్టార్ లైనర్’ వ్యోమనౌకను అమర్చిన ఈ రాకెట్ ప్రయాణానికి సిద్ధంగా ఇప్పటివరకు ఫ్లోరిడాలో కేప్ కెనెవరాల్ ల్యాంచ్ పాడ్ మీద నిలిచివుంది.

 

 

రాకెట్ సెంటార్ అప్పర్ స్టేజిలోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పాడైపోవటంతో ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. వాల్వును మార్చడానికి అట్లాస్-5ను వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీకి తరలిస్తారు.  

Herbivore Dinosaur: కొత్త డైనోసార్ జాతిని కనుగొన్న శాస్త్ర‌వేత్త‌లు..!

➤ ఈ యాత్రలో సునీతా విలియమ్స్‌తో పాటు తన సహోద్యోగి బుచ్ విల్మోర్‌తో పాల్గొంటారు.
➤ వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వారం పాటు గడుపుతారు.
➤ ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. 
➤ ఇప్పటివరకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఈ సేవలను అందిస్తోంది.
➤ స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.

➤ సునీతా విలియమ్స్ ఇప్పటివరకు రెండుసార్లు అంతరిక్ష యాత్రలు చేశాయి. 2007లో 129 రోజులు, 2012లో 182 రోజులు అంతరిక్షంలో గడిపారు.

Operation Meghdoot: ‘ఆపరేషన్‌ మేఘదూత్‌’కు 40 సంవత్సరాలు పూర్తి!!

Published date : 09 May 2024 10:50AM

Photo Stories