Skip to main content

United Nations : ఐరాస భద్రతా మండలిలో.. ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఈ విష‌యంలో..

భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్‌ కోరారు
United nations security council has no result on reforms  "Parvatane Harish calls for reforms in the UN Security Council during a General Assembly session in New York

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఈ విషయంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ 1965 నుంచి ఎటువంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని హరీష్‌ కోరారు.

NRI in America Elections 2024 : అమెరికా ఎన్నిక‌ల్లో విజ‌యం అందుకున్న ఆరుగురు ఎన్ఆర్ఐలు వీరే!

‘‘మేం (భారత్‌) ఈ సంవత్సరం చర్చలను ప్రారంభించిన సమయంలో యూఎన్‌ భద్రతా మండలిలో సంస్కరణల విషయాన్ని మరోసారి గుర్తించాం. భవిష్యత్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన, తక్షణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం. అయితే.. అనేక దశాబ్దాలుగా ఈ విషయాన్ని సమిష్టిగా తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

..1965లో కౌన్సిల్ చివరిసారిగా నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించబడింది. సంస్కరణల పురోగతికి ఆటంకం కలిగించే మూడు ప్రధాన అంశాలు ఉన్నా​యి. అసమర్థమైన అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయం కోసం పట్టుబట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

..అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ ప్రారంభమైన పదహారు ఏళ్ల నుంచి ప్రకటనలు ఇచ్చిపుచ్చుకోవటం, చర్చలు జరపటానికి మాత్రమే పరిమితం అయింది. నిర్దిష్టమైన ముగింపు లక్ష్యం లేదు. కొన్ని దేశాల ఏకాభిప్రాయం అనే అంశం..ఎటువంటి మార్పలు కోరుకోని యథాతథ స్థితికి అనుకూలంగా ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ముందుకు తెచ్చిన వాదన. గ్లోబల్ సౌత్ సభ్యునిగా.. కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిథ్యం అవసరమని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

Computer Viruses: సెకనుకో సైబర్‌ నేరం.. ప్రతీరోజు పుట్టుకొస్తున్న 90 లక్షల కంప్యూటర్‌ వైరస్‌లు!

Published date : 13 Nov 2024 09:55AM

Photo Stories