Tirupati District: అగ్రికల్చర్ సేవల్లో ప్రథమ స్థానంలో తిరుపతి జిల్లా
ఉత్తమ వ్యవసాయ అధికారిగా ఎస్.ప్రసాద్‌రావును, ఉత్తమ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా చంధ్రగిరి మండలం, పెరుమాళ్లపాళెం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ కే.జ్యోత్స్నను ఎంపిక చేశారు. ఆమేరకు వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ సోమవారం ఉత్తమ అధికారులు, ఉద్యోగుల వివరాలను ప్రకటించారు.
Rayalaseema Thermal Plant: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌కు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేరు
ప్రతినెలా వ్యవసాయశాఖలో ఉత్తమ జిల్లాతోపాటు, ఉత్తమ అధికారుల పేర్లను రైతు భరోసా పుస్తకంలో ప్రచురించడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాదిలో ఫిబ్రవరి, మార్చిలో తిరుపతి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా డీఏఓ ఎస్.ప్రసాద్‌రావును ఉత్తమ అధికారిగా ఎంపికచేశారు. తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ వరుసగా తిరుపతి జిల్లానే రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ద్వితీయ స్థానంలో కాకినాడ, తృతీయ స్థానంలో చిత్తూరు, 26వ స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచాయి.
Rare spider found in Horsleyhills: హార్సిలీహిల్స్‌పై అరుదైన సాలీడు