Strictness in Evaluation: పదో తరగతి మూల్యాంకనం సమయంలో టీచర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకుంటే..!
Sakshi Education
పదో తరగతి విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో ప్రకటించారు. కాని, అక్కడే ఒక తప్పిదం జరిగింది..
గూడూరు: ఇటీవల నిర్వహించిన పదో తరగతి మూల్యాంకనంలో ఓ తప్పిదం జరిగింది. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పరిమళ లక్ష్మీ బాలాజీ, శశికళ కుమారుడు కుషల్ శ్రీనివాస్ అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలు రాశాడు. ఆ విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో 90 పైగా మార్కులు రాగా, హిందీలో మాత్రం 17 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో సదరు విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రుల సూచన మేరకు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశాడు.
ఇటీవల రీ వెరిఫికేషన్ ఫలితాలు వచ్చాయి. ఇందులో కుషల్ శ్రీనివాస్‌కు అదే హిందీ సబ్జెక్టులో 75 మార్కులు వచ్చాయి. మూల్యాంకన సమయంలో అధికారులు, సంబంధిత టీచర్ చేసిన తప్పిదం వల్ల కుషల్ శ్రీనివాస్‌కు అన్యాయం జరిగింది. ఇలాంటి తప్పుల వల్ల విద్యార్థుల జీవితాలు బలవుతాయని, మూల్యాంకనం చేసేప్పుడు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు.
Published date : 31 May 2024 03:06PM