Skip to main content

Rare spider found in Horsleyhills: హార్సిలీహిల్స్‌పై అరుదైన సాలీడు

బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ప్రత్యేకమైన మొక్కలు, కీటకాలు, వన్యప్రాణులకు ఆలవాలం.
Endangered Indian ornamental tree spider, Pocilotheria regalis, Colorful Pocilotheria regalis spider - Horsly Hills discovery,Rare spider found in Horsleyhills, Rare Indian ornamental tree spider, Pocilotheria regalis,

ప్రత్యేకమైన ఓ సాలీడు అటవీశాఖ అతిథి గృహం గోడపై ఉండటాన్ని ఆదివారం అటవీ అధికారులు గుర్తించారు. పోసిలోథెరియా రెగలిస్‌ అని పిలువబడే భారతీయ అలంకార చెట్టు సాలీడుగా దీన్ని చెప్పుకొంటారు. సాధారణ సాలీడు కంటే భిన్నంగా, పెద్దగా కనిపించే ఈ సాలీడు కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. పసుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ సాలీడు పొడవు ఎక్కువ. ఇది హార్సిలీహిల్స్‌పై కనిపించడం చూస్తే వీటి సంతతికి చెందిన సాలీడు రకాలు ఇంకా ఉండవచ్చు. కొండపై అరుదైన మొక్కలను ఇప్పటికే ఉద్యాన పరిశోధక విద్యార్థులు గుర్తించిన విషయం తెలిసిందే.

Sonbhadra District: సోన్‌భద్ర జిల్లాకు ఉన్న‌ ప్రత్యేకతలు తెలుసా...

Published date : 07 Nov 2023 09:49AM

Photo Stories