Skip to main content

Sonbhadra District: సోన్‌భద్ర జిల్లాకు ఉన్న‌ ప్రత్యేకతలు తెలుసా...

దేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రత్యేకతల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది.
Unique Features of Sonbhadra, UP, Sonbhadra District, Bordering Four States in Sonbhadra,"Second Largest District in Uttar Pradesh
Sonbhadra District

యూపీలోని సోన్‌భద్ర జిల్లా అనేక ప్రత్యేకతలను కలిగివుంది. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్‌భద్ర. నిజానికి సోన్‌భద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా పోటీ పరీక్షలలో సోన్‌భద్ర జిల్లాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు.

Dholpur-Karauli Tiger Reserve: ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజ‌ర్వ్‌కు ఆమోదం

సోన్‌భద్ర యూపీలో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో ఖనిజాలు పెద్ద మొత్తంలో లభిస్తాయి. సోన్‌భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభ్యమవుతుంది.
1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్‌భద్ర అనే పేరు వచ్చింది. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్‌లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది.

Largest District in India: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది?

సోన్‌భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య  ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ‍ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు.

Train Journey: రైలు కదిలేముందు జర్క్‌ ఎందుకు?

Published date : 06 Oct 2023 01:23PM

Photo Stories