UPSC Civils Prelims 2024: ఈనెల 16న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..
Sakshi Education
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులకు కలెక్టరేట్‌లో వివరించారు డీఆర్ఓ..

తిరుపతి: నగరంలో ఈనెల 16న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్టు డీఆర్వో పెంచల కిషోర్ తెలిపారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో గూగల్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు తిరుపతి జిల్లాలో మొత్తం 11 సెంటర్లు కేటాయించగా.. 5,518 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. 11 మంది తహసీల్దార్లను లైజన్ అధికారులుగా వ్యవరిస్తారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
Tenth Supplementary Evaluation: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..
Published date : 08 Jun 2024 11:33AM