Tenth Supplementary Evaluation: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..
చిత్తూరు: పదో తరగతి మాన్యువల్ స్పాట్ వాల్యుయేషన్ స్థానంలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పది సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 1960 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 810 మంది పరీక్షలు రాశారు. వారికి 24 పేజీల జవాబు పత్రం బుక్‌లెట్ ఇచ్చారు. ఈ పత్రాలను విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పార్ట్–1 కాకుండా ఇతర జవాబు పత్రం మొత్తం స్కాన్ చేసే ప్రక్రియను చేపట్టారు.
ITI Admissions: ఐటీఐ అడ్మిషన్లకు ఈనెల 10 వరకు అవకాశం..
ఆన్‌లైన్ పాఠాలు బోధించేందుకు ఇచ్చిన ట్యాబ్స్ సహాయంతో ఉపాధ్యాయులు ఈ జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఒక్కొక్కరికి 75 వరకూ జవాబు పత్రాలను కేటాయిస్తారు. ప్రతి జిల్లా నుంచి 50 మంది చొప్పున మొత్తం 1,200 మంది కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి జాబితాలను పంపించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు ట్యాబ్‌లలో లాగిన్ అయితే తెరపై ఒకవైపు జవాబు పత్రం, మరోవైపు మార్కులు వేసేందుకు టేబుల్ వస్తుంది.
AP LAWCET 2024: రేపే లాసెట్ ప్రవేశ పరీక్ష.. వెంట ఇవి తెచ్చుకోవాల్సిందే
జవాబు పత్రంలో సమాధానం చూసి దానికి మార్కులు టేబుల్‌లో వేస్తారు. ఇలా ఒక ఉపాధ్యాయుడు దిద్దిన జవాబు పత్రాన్ని మరో టీచర్‌కు పంపించి మూల్యాంకనం చేయిస్తారు. ఈ ఇద్దరి మూల్యాంకనంలో పది శాతం కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే అప్పుడు మూడో ఉపాధ్యాయుడికి పంపించి అక్కడ వచ్చిన మార్కులను ఫైనల్ చేస్తారు. రీ కరెక్షన్, రీటోటలింగ్ విధానాలకు స్వస్తి పలికేందుకు ఆన్‌లైన్ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు.
AP ADCET: ఏడీసెట్–2024 రద్దు.. మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశాలు
మూల్యాంకన ప్రక్రియలో అధునాతన మార్పులకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా మూడంచెల విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం గణితం సబ్జెక్టు మాత్రం ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వచ్చే మార్చిలో అన్ని సబ్జెక్టులకు ఈ తరహా విధానం అమలు కానుంది.
Vacancies In High Court: హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు.. వివరాలు ఇవే
ప్రారంభమైన మూల్యాంకనం
జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభం అయ్యింది. జిల్లా కేంద్రంలో ఉన్న పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనాన్ని స్పాట్ కేంద్రం క్యాంప్ ఆఫీసర్ జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజు ప్రారంభించారు. స్పాట్ కేంద్రాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీతో ముగించాల్సి ఉంది. వివిధ జిల్లాల నుంచి గణితం మినహా 6 వేల జవాబు పత్రాలను కేటాయించారు. ఆ జవాబుపత్రాలను దిద్దేందుకు 100 మంది టీచర్లను నియమించారు.
Ts Teacher Tranfers and Promotions:మొదలైన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు.. షెడ్యూల్ విడుదల
పకడ్బందీగా మూల్యాంకన ప్రక్రియ
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేసిన నియమ నిబంధనలను పాటిస్తూ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. గురువారం ప్రక్రియను ప్రారంభించాం. ఈ నెల 9 వ తేదీ వరకు ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా స్పాట్ కేంద్రంలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు తాగునీరు, ఫర్నీచర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన గడువులోగా జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేస్తాం.
– దేవరాజు, డీఈఓ, చిత్తూరు జిల్లా