Demographics: తెలంగాణ జనాభాలో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 15 ఏళ్లలో యువశక్తి తగ్గిపోనుంది. రాష్ట్ర జనాభాలో 2021 ఏడాది నాటికి 15–40 ఏళ్లలోపు యువత 43.6 శాతం ఉండగా, 2036 నాటికి ఇందులో 15.9 శాతం తగ్గి.. 27.7 శాతం కానున్నట్లు అంచనా. ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం..
- రానున్న 15 ఏళ్లలో 40 ఏళ్ల పైబడిన వారి జనాభా 42.5 శాతానికి పెరగనుంది.
- 15–40 ఏళ్లలోపు గణాంకాలను పరిగణనలోకి తీసుకునే 6 శ్లాబుల్లో 35–39 ఏళ్ల శ్లాబు మినహా అన్ని శ్లాబుల్లోనూ తగ్గుదల నమోదు కానుంది. 80ఏళ్ల పైబడిన వారి సంఖ్య 82 శాతం పెరగనుంది.
- 2021 నాటికి రాష్ట్ర జనాభా 3,77,25,000 కాగా దేశ జనాభాలో ఇది 2.8 శాతమని అంచనా.
- రాష్ట్రంలో 50.3 శాతం మంది పురుషులు కాగా, 49.7 శాతం మంది మహిళలున్నారు.
విద్యుత్ వినియోగం ఇలా..
తాజా ప్రభుత్వ నివేదిక ప్రకారం... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో..)
Telangana: 2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్