Economy: తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021 ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తితోపాటు తలసరి ఆదాయంలోనూ ఏటేటా వృద్ధి నమోదవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5,05,849 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.9,80,407 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘తెలంగాణ రాష్ట్ర గణాంక సంగ్రహణ–2021(తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021)లో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు.
నివేదికలోని కొన్ని అంశాలు..
- 2014–15 నుంచి 2020–21 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 93.8 శాతం వృద్ధి నమోదైంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5 శాతంగా నమోదైంది. 2014–15లో ఇది 4 శాతం మాత్రమే.
- రాష్ట్రం ఏర్పాటైన తొలి రెండేళ్లలో జీడీపీ కంటే జీఎస్‌డీపీ పెరుగుదల తక్కువ కాగా, ఆ తర్వాత జీడీపీ కంటే ప్రతియేటా జీఎస్‌డీపీలో పెరుగుదల నమోదవుతోంది.
- తెలంగాణ ఏర్పాటైన తర్వాత జీఎస్‌డీపీ వార్షిక సగటు పెరుగుదల 11.8 శాతం కాగా, జీడీపీ పెరుగుదల 8.5 శాతమే.
- కోవిడ్ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది. 2020–21లోనే జీఎస్‌డీపీ పెరుగుదల 2.4 శాతం నమోదైంది. అదే సమయంలో జీడీపీ మాత్రం మైనస్ 3 శాతానికి తగ్గింది.
2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
- స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021 గణాంకాల ప్రకారం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ముందంజలో ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,37,632కు చేరింది.
- రాష్ట్రం ఏర్పాటైన 2014–15 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 91,121 కాగా, దేశ తలసరి ఆదాయం రూ. 63,462గా నమోదైంది.
- రాష్ట్రం ఏర్పాటైన తొలి రెండేళ్లలో సగటు వార్షిక తలసరి ఆదాయం పెరుగుదల తెలంగాణలో 10.9, జాతీయస్థాయిలో 11.7 శాతంగా నమోదయ్యాయి. ఆ తర్వాత వార్షిక సగటు పెరుగుదల 11.3 శాతం కాగా, దేశ సగటు 7.3 శాతంగా నమోదైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021 ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
ఎక్కడ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి, గతులను గురించి వెల్లడించేందుకు..
చదవండి: ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్ వృద్ధి రేటు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్