GDP Growth Rate: ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్ వృద్ధి రేటు?
భారత జీడీపీ వృద్ధి రేటు 2021–22 ఆర్థిక సంతవ్సరంలో 8.6 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ‘‘ఎన్‌ఎస్‌వో 2021–22 సంవత్సరానికి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి రూ.147.2 లక్షల కోట్లుగా ప్రకటించొచ్చు. దీని ప్రకారం జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంటుంది. 2022 జనవరి 7న విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా 9.2 శాతం కంటే తక్కువ’’ అని ఇండియా రేటింగ్స్ తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం అంచనా 9.2 శాతంగా ఉంది.
ఏఎస్‌సీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
క్రిప్టో కరెన్సీలు, నాన్–ఫంజిబుల్ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి(అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా–ఏఎస్‌సీఐ) మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. 2022, ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ), నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో ఏఎస్‌సీఐ తాజా గైడ్‌లైన్స్ రూపొందించింది. ఏఎస్‌సీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
చదవండి: ఐబీఎం సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్